అడవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి: కొండా సురేఖ

రాష్ట్రంలో 24.05 శాతం ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Update: 2024-03-21 17:09 GMT
అడవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి: కొండా సురేఖ
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 24.05 శాతం ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అడవులను సంరక్షించుకుంటూనే, మరోవైపు అటవీ సంపదను పెంచేందుకు సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగులు, సిబ్బందికి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి శాశ్వతమైనదని, మానవ మనుగడకు ఆధారంగా నిలుస్తున్న అడవులను జాగ్రత్తగా కాపాడుకునేలా ఉద్యమించేందుకు ప్రేరణ లభిస్తుందన్నారు.

ప్రకృతిని సంరక్షిస్తూ, ప్రకృతితో మమేకమై జీవించడమే అర్థవంతమైన జీవితమని వెల్లడించారు. ఈయేడు ‘అడవులు-ఆవిష్కరణలు’ మెరుగైన ప్రపంచం కోసం కొత్త పరిష్కారాలు అనే థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా అటవీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. మానవాళి మనుగడకు, భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా జీవించడానికి అడవులను సంరక్షించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అడవులను కాపాడుకుంటేనే జీవవైవిధ్యం వర్ధిల్లుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టే చర్యలకు ప్రజలు తమవంతు సహకారం అందిస్తేనే అడవుల విస్తీర్ణంలో వృద్ధి నమోదవుతుందన్నారు.

Tags:    

Similar News