సీఎం ఎవరనేది డీకే శివ కుమార్ చెప్పిన ఎవరు పట్టించుకోరు: కోమటిరెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో రోజు రోజు సీఎం ఎవరనే విషయంపై తీవ్ర దుమారం రేపుతుంది. పార్టీలో సీనియర్ నాయకులందరూ తానంటే తానే సీఎం అభ్యర్థినని చెప్పుకుంటు ఉన్నారు.

Update: 2023-10-30 07:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో రోజు రోజు సీఎం ఎవరనే విషయంపై తీవ్ర దుమారం రేపుతుంది. పార్టీలో సీనియర్ నాయకులందరూ తానంటే తానే సీఎం అభ్యర్థినని చెప్పుకుంటు ఉన్నారు. ఈ క్రమంలో కర్ణాటక ఉప్ ముఖ్యమంత్రి పాల్గొన్న రోడ్ షో లో.. డీకే మాటలను తెలుగులోకి చెప్పి రామ్మోహన్ రెడ్డి, రేవంత్ సీఎం అంటూ పలుమార్లు తప్పుగా చెప్పారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి సీఎం అని డీకే శివకుమార్ అనలేదని.. ఆయన మాటలను రామ్మోహన్ రెడ్డి తప్పుగా చెప్పాడని అన్నారు. అలాగే సీఎం ఎవరు అనేది డీకే చెప్పిన ఎవరూ పట్టించుకోరని కోమటి రెడ్డి వెంటక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..