కాంగ్రెస్‌లో చేరడానికి కారణం అదే.. పార్టీ మార్పుపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్లారిటీ

పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Update: 2024-07-15 14:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మార్పు అనంతరం మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పఠాన్ చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్‌ను వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పఠాన్ చెరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్‌లో తనకు సహకరించిన పార్టీ చీఫ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాగా, గత మూడు రోజులుగా నెలకొన్న గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారానికి ఇవాళ ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. శనివారం జాయినింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి వెళ్లిపోయిన మహిపాల్ రెడ్డి.. ఇవాళ (సోమవారం) ఎట్టకేలకు అధికార పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మహిపాల్ రెడ్డి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

కాగా, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జంపింగ్‌తో బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన ఎమ్మె్ల్యేల సంఖ్య 10కి చేరింది. గూడెం కంటే ముందు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీలు బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఎమ్మెల్యేల వలసల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగగా.. ఇప్పుడు ఏకంగా ఆయన సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే పార్టీ మారడం గులాబీ వర్గాల్లో గుబులు రేపుతోంది. 

Tags:    

Similar News