Damodar Raja Narasimha: వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు ఇబ్బంది కలగదు

ఎస్సీ వర్గీకరణ(SC Classification) వల్ల ఎవరి ప్రయోజనాలకు ఇబ్బంది కలగదు అని మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodar Rajanarsimha) స్పష్టం చేశారు.

Update: 2025-02-04 13:39 GMT
Damodar Raja Narasimha: వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు ఇబ్బంది కలగదు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణ(SC Classification) వల్ల ఎవరి ప్రయోజనాలకు ఇబ్బంది కలగదు అని మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodar Rajanarsimha) స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. 30, 40 ఏళ్ల కల నేడు సాకారం అవుతోందని అన్నారు. 30 ఏళ్ల ఉద్యమానికి నేడు పరిష్కారం దొరికిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వల్ల కొందరిలో భయం, అభద్రతాభావం కలుగుతోంది. వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు ఇబ్బంది కలగదని మంత్రి దామోదర భరోసా ఇచ్చారు. అంతకుముందు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.

కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్‌ వేశామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఎందరో ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చింది. చాలా రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఓటు బ్యాంకుగా చూశాయి తప్ప.. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేయలేదు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో తరతరాలుగా నిర్లక్ష్యానికి, దోపిడీకి గురైన వారికి న్యాయం చేయాలని సంకల్పించాం. వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరుతున్నా అని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News