Lok Manthan: ఆ బాధ్యత మనమీదే ఉంది.. తెలంగాణ గవర్నర్ కీలక పిలుపు

హైదరాబాద్ శిల్పారామం(Shilparam)లో ఏర్పాటు చేసిన లోక్ మంథన్(Lok Manthan) అంతర్జాతీయ కళా ప్రదర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రారంభించారు.

Update: 2024-11-22 07:06 GMT
Lok Manthan: ఆ బాధ్యత మనమీదే ఉంది.. తెలంగాణ గవర్నర్ కీలక పిలుపు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శిల్పారామం(Shilparam)లో ఏర్పాటు చేసిన లోక్ మంథన్(Lok Manthan) అంతర్జాతీయ కళా ప్రదర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రాల్గొన్న గవర్నర్ విష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. భారత సంస్కృతికి ఎన్నో కుట్రలను తట్టుకుని నిలబడిన ఘనమైన చరిత్ర ఉన్నదని తెలిపారు.

భాషలు, సంస్కృతులు, జీవన విధానాలు.. ఇలా ఎన్నో రంగాల్లో భిన్నత్వంలో ఏకత్వమున్న దేశమని కొనియాడారు. దేశ సమైక్యతను ముందుకు తీసుకెళ్లడంలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు ప్రతి రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. లోకమంథన్ - 2024 కార్యక్రమం.. ఈ దిశగా మనకు మరింత మార్గదర్శనం చేసి ముందుకు నడుపుతుందనే విశ్వాసం నాకుందని తెలిపారు. విదేశీ కుట్రలు తట్టుకుని నిలబడిన మనం.. ఐకమత్యంతో, సామరస్యంతో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News