మోసం చేయడం కాంగ్రెస్‌కు చేతకాదు: బండి సుధాకర్ గౌడ్

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నదని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్​గౌడ్ అన్నారు.

Update: 2025-01-30 17:24 GMT
మోసం చేయడం కాంగ్రెస్‌కు చేతకాదు: బండి సుధాకర్ గౌడ్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నదని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్​గౌడ్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందడం తప్ప ఈ దేశానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. కేంద్ర పెద్దల మిత్రులకు దాదాపు రూ.18 లక్షల కోట్లు మాఫీ చేసింది వాస్తవం కాదా? అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు ప్రయాణం కింద కోట్లాది మంది మహిళలు లబ్ధి పొందగా, ఇందుకోసం ప్రభుత్వం 4500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 50 లక్షల మంది గృహిణులు ఉపయోగించుకుంటున్నారన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ 43 లక్షల కుటుంబాలకు అందుతున్నదన్నారు. ఏడాది కాలంలో రైతుబంధు, రుణమాఫీ, రైతు భరోసా కింద 58,280 కోట్ల రూపాయలు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేసిన ముఖ్యమంత్రి రైతుబిడ్డ రేవంత్ రెడ్డి అన్నారు. మోసం చేయడం కాంగ్రెస్‌కు చేతకాదని అన్నారు.

Tags:    

Similar News