నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

కొత్తగా ప్రభుత్వం ఏర్పడినందున అనేక ప్రభుత్వరంగ సంస్థలకు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్.. పార్టీ కోసం పనిచేసినవారికే ప్రయారిటీ ఉంటుందన్నారు.

Update: 2024-01-01 11:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా ప్రభుత్వం ఏర్పడినందున అనేక ప్రభుత్వరంగ సంస్థలకు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్.. పార్టీ కోసం పనిచేసినవారికే ప్రయారిటీ ఉంటుందన్నారు. సన్నిహితులు, బంధువులు అనే ప్రాతిపదికన పదవుల పందేరం ఉండదని నొక్కిచెప్పారు. ఎన్నికల సమయంలోనే పదవులపై కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టత ఇచ్చిందని గుర్తుచేశారు.

సచివాలయంలో న్యూ ఇయర్ సందర్భంగా పాత్రికేయులతో చిట్‌చాట్‌లో పలు అంశాలను సీఎం ప్రస్తావించారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసినవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని ఇచ్చిన హామీ మేరకే త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు. విస్తృత స్థాయి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో, దానివల్ల ఏ మేరకు న్యాయం జరుగుతుందో నిశితంగా ఆలోచించి నిర్ణయం ఉంటుందన్నారు.

Tags:    

Similar News