హిందూ ధర్మం బలపడేది అప్పుడే: స్వామి విజ్ఞానానంద
విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్నీ రంగాల్లో సమాజం బలంగా ఉన్నప్పుడే హిందూ ధర్మం బలపడుతుందని వరల్డ్ హిందూ ఫోరమ్ వ్యవస్థాపకులు స్వామి విజ్ఞానానంద్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్నీ రంగాల్లో సమాజం బలంగా ఉన్నప్పుడే హిందూ ధర్మం బలపడుతుందని వరల్డ్ హిందూ ఫోరమ్ వ్యవస్థాపకులు స్వామి విజ్ఞానానంద్ అన్నారు. హిందూ ధర్మం బలంగా ఉంటే దేశం ఆర్థిక పరిపుష్టి సాధిస్తుందన్నారు. వరల్డ్ హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 24 నుంచి 26 తేదీ వరకు బ్యాంకాక్‌లో వరల్డ్ హిందూ కాంగ్రెస్ మహాసభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆదివారం హైదరాబాద్‌లో ఒక హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో స్వామితో పాటు మాజీ డీజీపీ ఆరవింద్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు.
ఆర్థిక, విద్య, వైద్య, ఆరోగ్య, యువత ఇలా మొత్తం ఏడంశాలపై సదస్సు నిర్వహిస్తున్నట్లు స్వామి విజ్ఞానానంద చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మూడు వేలకు పైగా ప్రతినిధులు పాల్గొంటారన్నారని తెలిపారు. ఇప్పటికే అమెరికా, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాల్లో హిందూ మహాసభలు నిర్వహించామని మూడో సదస్సును బ్యాంకాక్‌లో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆసక్తి కలవారు http://www.worldhinducongress.org ద్వారా రిజిర్వేషన్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.