స్టూడెంట్స్ అలర్ట్: Telangana Intermediate Board కీలక ప్రకటన

ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది.

Update: 2022-12-08 11:16 GMT
స్టూడెంట్స్ అలర్ట్: Telangana Intermediate Board కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. నవంబర్ 14 నుంచి 30లోపు ఫీజులు చెల్లించాలని గతంలో ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 2 నుంచి 6 వరకు.. రూ.500 రుసుముతో 8 నుంచి 12 వరకు.. రూ.1000 రుసుముతో 14 నుంచి 17 వరకు.. రూ.2000 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. అయితే, విద్యార్థుల ఫీజు చెల్లించేందుకు గడువును పొడగించాలన్న వినతి మేరకు తాజాగా కేవలం రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 12 వరకు ఫీజులు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మరోసారి అవకాశం కల్పించింది. రూ. 100 ఆలస్య రుసుంతో ఈ నెల 12వ తేదీ వరకు ఇంటర్‌‌ ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. విద్యార్థులు వారి కాలేజీల్లో ఫీజులను చెల్లించాలని సూచించింది. స్టూడెంట్ల నుంచి ఫీజులను స్వీకరించే కాలేజీలు డిసెంబర్ 13వ తేదీలోగా ఇంటర్ బోర్డుకు ఫీజుల మొత్తాన్ని బదిలీ చేయాలని బోర్డ్ ఆదేశించింది.

Tags:    

Similar News