BREAKING: బీఆర్ఎస్ గెలవబోయే MP సీట్ల సంఖ్య తేల్చి చెప్పేసిన కేసీఆర్

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే ఎంపీ సీట్ల సంఖ్యపై మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్

Update: 2024-04-18 13:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే ఎంపీ సీట్ల సంఖ్యపై మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 8 లోక్ సభ సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తోందని.. మరో మూడు స్థానాల్లో విజయావకాశాలున్నాయని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేఖత ఉందని.. దానిని అనుకూలంగా మల్చుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేద్దాం.. జనం నుంచి మంచి స్పందన వస్తోందని సూచించారు. ఈ నెల 22 నుంచి రోడ్డు షోలు ప్రారంభమౌతాయని.. ఒక్కో లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని రెండు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్డు షోలు నిర్వహిద్దామని చెప్పారు.

ఉదయం రైతుల వద్దకు.. సాయంత్రం వేళల్లో రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్‌లు ఉంటాని స్పష్టం చేశారు. కీలకమైన వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. రైతు సమస్యలపై స్పందించాలని.. పోస్టు కార్డు ఉద్యమం చేయాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. ఒక్కో పార్లమెంట్ పరిధిలో లక్ష కార్డులు రాయాలని ఆదేశించారు. రైతుల కల్లాల దగ్గరికి వెళ్లి రూ.500 బోనస్‌పై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పారు. ప్రభుత్వ హామీలను గుర్తు చేయాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Read More..

మానసిక రోగిని తలపించేలా కేసీఆర్ వ్యాఖ్యలు.. తుమ్మల కౌంటర్ 


Similar News