సమస్యలు తెలుసుకోవాలని కేసీఆర్ పంపిండు : MLC Kaushik Reddy

పింఛన్ వస్తుందా.. పూరి గుడిసెలో ఉన్నోళ్లకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తా అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారు.

Update: 2022-12-03 03:19 GMT
సమస్యలు తెలుసుకోవాలని కేసీఆర్ పంపిండు : MLC Kaushik Reddy
  • whatsapp icon

దిశ, హుజూరాబాద్: అమ్మ కేసీఆర్ పింఛన్ వస్తుందా.. పూరి గుడిసెలో ఉన్నోళ్లకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తా అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురిని పేరు పెట్టి పలుకరించిన కౌశిక్ రెడ్డి అర్హులందరికీ పించన్లు అందితున్నాయో లోదో అడగమని సీఎం కేసీఆర్ తనతో చెప్పాడని ఆసక్తికర వాఖ్యలు చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదోళ్లకే ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యల విని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, కౌన్సిలర్ అపరాజ ముత్యం రాజు తదితరులు ఉన్నారు. 


Read More.......

రష్యా ఉక్రెయిన్ వార్ : 13వేల మంది ఉక్రెయిన్ సోల్జర్స్ మృతి

Tags:    

Similar News