BRS ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2024-02-23 03:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం బాధాకరమని ఆమె మృతికి సంతాపం తెలిపారు. లాస్య నందిత కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం లాస్య మృతికి సంతాపం తెలిపారు. చిన్న వయస్సుల్లోనే యువ ఎమ్మెల్యేను కోల్పోవడం బాధకరమన్నారు.

కాగా, ఇవాళ తెల్లవారుజూమున పటాన్ చెరు సమీపంలో ఓఆర్ఆర్‌పై లాస్య ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. అతి వేగంగా దూసుకెళ్లిన ఆమె కారు అదుపుతప్పి డీవైడర్‌ను కొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్కకడే మృతి చెందారు. ఆమె డైవ్రర్, పీఏలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రి తరలించారు. చిన్న వయస్సుల్లోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో ఆమె కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర విషాదం నెలకొంది.

Read More : MLA లాస్యను వెంటాడిన మృత్యువు.. 60 రోజుల్లో మూడు ప్రమాదాలు.. ఇవాళ మృతి..!

Tags:    

Similar News