ఎన్నికల రంగంలోకి కేసీఆర్.. 13 నుంచి బస్సు యాత్ర..!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా ప్రజల్లోకి కేసీఆర్ రాలేదు.
దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా ప్రజల్లోకి కేసీఆర్ రాలేదు. కానీ ఇటీవల నీటి సమస్యలు, పంటపోలాలు ఎండిపోవడం వంటి సమస్యలపై స్వయంగా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 13 నుంచి యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.. ఈ యాత్ర ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బస్సుయాత్రను చేవెళ్ల పార్లమెంట్ నుంచి శ్రీకారం చుట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.