కేసీఆర్ ఎలక్షన్టీమ్ రెడీ? తలమునకలైన సీఎస్ !
సీఎం కేసీఆర్ ఎలక్షన్ టీమ్‌ను రెడీ చేసుకుంటున్నారు. ఏ ఐఏఎస్ ఎక్కడ ఉండాలి? ఏ ఐపీఎస్‌కు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి? అనే అంశాలపై సీరియస్‌గా కసరత్తు జరుగుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ ఎలక్షన్ టీమ్‌ను రెడీ చేసుకుంటున్నారు. ఏ ఐఏఎస్ ఎక్కడ ఉండాలి? ఏ ఐపీఎస్‌కు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి? అనే అంశాలపై సీరియస్‌గా కసరత్తు జరుగుతున్నది. సీఎం డైరెక్షన్ మేరకే అధికారుల బదిలీల లిస్టు రెడీ చేసినట్టు సమాచారం. ఇందుకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ రెండు, మూడు రోజులుగా పలు జాబితాలు సిద్ధం చేసినట్టు తెలిసింది. అందులో నచ్చిన లిస్టుపై కేసీఆర్ ఆమోదం తెలిపిన వెంటనే భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు ఉంటాయని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ ఉంది. ఒకే శాఖలో ఎక్కువ కాలం ఉన్న ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ కొన్ని కీలకమైన శాఖల్లోని ఐఏఎస్‌లను మరికొంతకాలం కొనసాగించేందుకు కేసీఆర్ మొగ్గు చూపినట్టు సమాచారం.
నచ్చిన వారికి ప్రయార్టీ
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత టీఆర్ఎస్ పూర్తిగా ఎన్నికలపై ఫోకస్ పెట్టనుంది. దీంతో ఇప్పుడే తమ మాట వినే ఆఫీసర్లను ఎక్కడ నియమించుకోవాలో ప్రగతిభవన్ వర్గాలు కసరత్తు పూర్తి చేశాయి. ఆ మేరకు సీఎస్‌కు అందిన రోడ్ మ్యాప్లిస్టు తయారైనట్టు తెలిసింది. ఎన్నికల టైమ్‌లో చెప్పినట్టుగా వినే ఆఫీసర్లకు కీలక పోస్టులు దక్కే చాన్స్ ఉంది.
ఇవి కూడా చదవండి :