Cbi Enquiry Issue: సీఎం కేసీఆర్‌తో ముగిసిన కవిత భేటీ.. తిరిగి ఇంటికి పయనం

సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను సీబీఐ అధికారులు విచారించారు. ఈ వివరాలను ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించారు....

Update: 2022-12-11 16:00 GMT

దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను సీబీఐ అధికారులు విచారించారు. కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ వివరాలను ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించారు. దాదాపు వీరి భేటీ 45 నిమిషాల పాటు సాగింది. అనంతరం కవిత తమ ఇంటికి బయల్దేరి వెళ్లారు.

అంతకుముందు ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆమె ఇంట్లోనే విచారించారు. అడ్వకేట్ ఆధ్వర్యంలో 7 గంటలకు పైగా కవితను ప్రశ్నించారు. అనంతరం సీబీఐ అధికారులు ఢిల్లీ వెళ్లిపోయారు.కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు గతంలోనే నోటీసులిచ్చారు. అయితే తాను సాక్షిగా మాత్రమే ఉన్నానని.. ఇంటి వద్దే విచారించాలని కవిత కోరడంతో సీబీఐ అధికారులు తాజాగా హైదరాబాద్ వచ్చి కవితను విచారించారు.

అయితే కవితను విచారించేంతసేపు కూడా ఆమె ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్సీ కవితను ఏం ప్రశ్నలు వేస్తున్నారోనని బీఆర్ఎస్ కార్యకర్తలు టెన్షన్ పడ్డారు. సీబీఐ విచారణ ముగిసే వరకు కవిత కోసం ఎదురు చూశారు. విచారణ ముగియడంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత అభివాదం తెలిపారు. మరోసారి సీబీఐ అధికారులు విచారించే అవకాశాలుండటంతో లీగల్ కౌన్సిల్‌తో ఎమ్మెల్సీ కవిత చర్చించారు.

Tags:    

Similar News