కవిత అరెస్ట్ కు బీజేపీకి సంబంధం లేదు:బీజేపీ ఎంపీ లక్ష్మణ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు.

Update: 2024-03-16 06:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు.ఏడాది కాలంగా ఈడీ ఈ కేసులో దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలపై ఈ కేసులో అనేక ఆరోపణలు వచ్చాయని ఆ రాష్ట్ర మంత్రి జైల్లో ఉన్నారన్నారు. లిక్కర్ కేసులో కవితకు సంబంధం ఉందో లేదో చెప్పాలన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న లక్ష్మణ్.. కోర్టులో కవిత తన వాదన చేప్పుకోవచ్చన్నారు. నేరం చేయకుంటే శిక్ష పడదు, నేరం చేస్తే శిక్ష పడుతుందన్నారు. నేరం చేయకపోతే భయమేందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తెలంగాణను లూటీ చేసిందని కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన అవినీతిపై కూడా విచారణ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఓబీసీలను విస్మరించిందని ధ్వజమెత్తారు. కేంద్రంలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఎందుకు ఇవ్వలేదని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. మీహయాంలో కుల గణన ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. మోడీ మళ్లీ ప్రధాని అవడాన్ని కాంగ్రెస్ సహించలేకపోతోందన్నారు.

Tags:    

Similar News