మీ పాపాల‌ను ప్ర‌క్షాళ‌న చేసుకోండి.. కృష్ణా జలాలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్..

కృష్ణా జలాలపై తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు.

Update: 2024-02-12 08:10 GMT
మీ పాపాల‌ను ప్ర‌క్షాళ‌న చేసుకోండి.. కృష్ణా జలాలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్..
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జలాలపై తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. కృష్ణా న‌దిపై ఉన్న ప్రాజెక్టుల‌ను కేంద్రానికి అప్ప‌జెప్ప‌డం రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన పెద్ద త‌ప్పు అని తెలిపారు. గ‌తంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల‌ను అప్ప‌చెప్పే నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకుంటూ శాస‌న స‌భ‌, మండ‌లిలో తీర్మానం తీసుక‌రావాలని డిమాండ్ చేశారు. మీ పాపాల‌ను ప్ర‌క్షాళ‌న చేసుకోండి.. తెలంగాణ హ‌క్కుల విష‌యంలో బీఆర్ఎస్ సంపూర్ణ మద్దత్తు ఉంటుందని చెప్పారు. 

Tags:    

Similar News