నేను రౌడీ టైప్.. అందరి పేర్లు రాసుకుంటున్నా ఎవరినీ వదిలిపెట్టా.. కల్వకుంట్ల కవిత వార్నింగ్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచివారు అయ్యుండొచ్చు కానీ తాను కొంచెం రౌడీ టైపు అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2025-04-15 13:29 GMT
నేను రౌడీ టైప్.. అందరి పేర్లు రాసుకుంటున్నా ఎవరినీ వదిలిపెట్టా.. కల్వకుంట్ల కవిత వార్నింగ్
  • whatsapp icon

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచివారు అయ్యుండొచ్చు కానీ తాను కొంచెం రౌడీ టైపు అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లొద్దని కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లన్నింటినీ పింక్ బుక్‌లో రాసుకుంటామని హెచ్చరించారు. బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని, కేసులు పెట్టించే వారిని పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదన్నారు. ఇంతకూ ఎమ్మెల్సీ కవిత ఎవరికి వార్నింగ్ ఇచ్చింది..? పింక్ బుక్‌లో ఎవరి పేర్లు ఉన్నాయో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

రామానాయుడు స్టూడియోకి కేటాయించిన భూముల వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూసింది. స్టూడియో కోసం తీసుకున్న భూములను రియల్ ఎస్టేట్ వెంచర్ కింద మార్చేందుకు నిర్మాత దగ్గుబాటి సురేశ్​బాబు ప్లాన్​ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో స్వయంగా ఆయనే దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఇంతకూ సురేష్ బాబు ఎన్ని ఎకరాల్లో విల్లాలు నిర్మించడానికి ప్లాన్ చేశారు..? అనుమతులు ఎవరు కోరారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

తెలంగాణ రాష్ట్రంలో హీట్‌వేవ్‌పై సర్కార్ అలర్ట్ అయింది. రాష్ట్రంలో ఎండలు మండుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు పలు సూచనలు చేసి ఆదేశాలు జారీ చేసింది. తీవ్రమైన ఎండలు, వడగాలులు, వడదెబ్బ వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబాలకు ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించడానికి వీలుగా జీవో విడుదల చేసింది. వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే గతంలో రూ.50 వేలు చెల్లించేవారు.. ఆ ఎక్స్‌గ్రేషియాను రూ.4 లక్షలకు సర్కార్‌ పెంచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్‌లో చూడండి.

ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ప్రధాని మోడీ అమరావతి పునర్నిర్మాణ పనులకు మే 2న శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అమరావతిలో మోడీ పర్యటన ఖరారైనట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తి చేయనున్నామని, ఈ మేరకు టెండర్లు పిలిచామని సీఎం తెలిపారు. కేబినెట్ ​సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఈ విషయాన్ని మంత్రుల బృందానికి వెల్లడించారు. మోడీ రాకతో అమరావతి రాజధాని పనులు మరింత ఊపందుకోనున్నాయి. అమరావతి పునర్నిర్మాణ పనులపై సీఎం ఇంకా ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Similar News