నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం : ఎమ్మెల్యే కవ్వంపల్లి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి

Update: 2024-09-27 15:15 GMT

దిశ,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి ,సిరికొండ ఇల్లంతకుంట గ్రామాల్లో మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ,రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యటించారు. అనంతగిరి గ్రామంలో ఆర్ ఆర్ ప్యాకేజీ లో గ్రామంలో ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులు ఇంకా పెండింగ్ లో   ఉన్నాయని గ్రామస్తులు ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతగిరి గ్రామంలోని పోచమ్మ దేవాలయం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అనంతగిరి రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని ఈకో టూరిజం కింద అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేయడానికి ప్రతిపాదనలు తయారు చేయించి పంపించాలని కలెక్టర్ ను కోరారు.

సిరికొండ గ్రామంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల నష్టపోతున్న పట్టా భూములను, పెద్దలింగాపూర్ చెరువు వాటర్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎస్సీ కాలనీ సందర్శించి త్వరలో వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఇల్లంతకుంట గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం పరిశీలించారు విద్యార్థులకు మిగిలిపోయిన హాస్టల్ గదులను పూర్తి చేయడానికి కలెక్టర్ నిధుల ద్వారా నిధులు మంజూరు చేశారు.

అనంతరం ఇల్లంతకుంట గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ సందర్శించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న వాళ్లు సమస్యలను పరిశీలించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల అధికారులు ఎమ్మార్వో ఎంపీడీవో,ఎంపీవో పంచాయతీరాజ్ ఏఈ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News