జేఈఈ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థుల ప్రతిభ

నేడు ప్రకటించిన జేఈఈ (మెయిన్స్) ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు.

Update: 2023-04-29 14:46 GMT

దిశ, కరీంనగర్ టౌన్ : నేడు ప్రకటించిన జేఈఈ (మెయిన్స్) ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. జేఈఈ (మెయిన్స్) ఫలితాల్లో అన్ని కేటగిరిల్లో విద్యార్థులు జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకులు ఏ.శ్రావణ్ 617, బి.భానుప్రకాష్ 676, ఎన్. సుహాస్ రెడ్డి 1225, ఎ.అనిల్ 1524, పి.అభినయ 1686, ఎం.రాజారెడ్డి 1837 ర్యాంకును సాధించారు.

కాగా, ర్యాంకులు సాధించిన విద్యార్థులు స్కూల్ లెవల్ పౌండేషన్ తో పాటు, ఇంటర్ లో ఐఐటీ కోచింగ్ వల్ల జేఈఈ మెయిన్స్ లో 71శాతం సాధించి జేఈఈ (అడ్వాన్స్)కు 231 మంది విద్యార్థులు డఅర్హత సాధించారని ట్రినిటీ కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలో, ఉత్తమ విద్యా విధానంతో తమ విద్యార్ధులు ఉన్నత ర్యాంకులు సాధించడం సాధ్యమైందని ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు. ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ వివిధ ట్రినిటీ కళాశాలల ప్రిన్సిపాల్స్ సత్కరించారు.

ఈ సందర్భంగా తేది 30.04.2023 రోజున ఉదయం 10 నుంచి 11.30 వరకు తమ కళాశాలలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. టెస్ట్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు (ఇంటర్ తో పాటు ఐఐటీ-జేఈఈ/నీట్) అడ్మిషన్ టెస్ట్ లో వారు చూపిన ప్రతిభ ఆధారంగా పూర్తిగా ఫీజు మాఫీ లేదా ఫీజులో రాయితీ ఇస్తామని తెలియజేశారు. జేఈఈ (అడ్వా్న్స్)కు అర్హత సాధించిన కళాశాల మరియు ఇతర కళాశాలల విద్యార్థినీ విద్యార్థులకు అందరికి ఉచితంగా నెల రోజులు కోచింగ్ ట్రినిటీ ప్రైమ్ క్యాంపస్ లో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే శిక్షణ ఇవ్వనున్నట్లు చైర్మన్ ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు.

Tags:    

Similar News