కలెక్టర్ ఆదేశించిన ముందుకు సాగని పనులు..

లింగన్నపేట- గంభీరావుపేట మధ్యలో మానేరు పై నిర్మిస్తున్న

Update: 2024-09-29 12:57 GMT

దిశ,గంభీరావుపేట : లింగన్నపేట- గంభీరావుపేట మధ్యలో మానేరు పై నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జి వంతెన వద్ద తాత్కాలిక రోడ్డు పనులను కలెక్టర్ సందీప్ కుమార్ 16 రోజుల క్రితం తనిఖీ చేశారు. వాహనదారులకు ఇబ్బంది కాకుండా రోడ్డు పనులు ను వెంటనే పూర్తి చేయాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అయినా కానీ అధికారులు మాత్రం రోడ్డును అందుబాటులోకి తీసుకు రాలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు గుత్తేదారు మూడు రోజులు నామమాత్రంగా మట్టి పోసి మధ్యలో నిలిపివేశారు. గంభీరావుపేట లింగన్నపేట మధ్య 3 కిలోమీటర్ల దూరం ఉండగా రోడ్డు తెగిపోవడంతో బస్సులు తిరిగి నర్మల మీదుగా వెళ్లడానికి 13 కిలోమీటర్ల దూరం అవుతుంది.

నాలుగింతల దూరంతో గత 28 రోజులుగా ఈ ప్రాంత ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక బ్రిడ్జి వెంటనే కంప్లీట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్ అండ్ బి ఏ ఈ కిరణ్ ను వివరణ కోరగా వారం రోజుల క్రితం వర్షం పడడం వల్ల పని నెమ్మదిగా జరిగిన విషయం నిజమే ఇక పైపులు సెట్ చేయవలసిన అవసరం ఉన్నది. దాదాపు సగం పని అయిపోగా ఇంకా రెండు మూడు రోజుల్లో తాత్కాలిక రోడ్డు పూర్తి చేస్తామని చెప్పారు.


Similar News