ఈ బుడ్డొడి పేరు 'ఇండియన్' ..
గోదావరిఖని గంగానగర్ కు చెందిన సామాజిక కార్యకర్త, ఫిలిం డైరెక్టర్ లింగంపల్లి రాజేష్ (సాంస్కృతిక సారథి ఉద్యోగి - మంచిర్యాల) తన చిన్న కొడుకు పేరు 'ఇండియన్' గా నామకరణం చేశాడు.
దిశ, గోదావరిఖని : గోదావరిఖని గంగానగర్ కు చెందిన సామాజిక కార్యకర్త, ఫిలిం డైరెక్టర్ లింగంపల్లి రాజేష్ (సాంస్కృతిక సారథి ఉద్యోగి - మంచిర్యాల) తన చిన్న కొడుకు పేరు 'ఇండియన్' గా నామకరణం చేశాడు. చిన్ననాటి నుంచే లింగంపల్లి రాజేష్ దేశం మీద అభిమానంతో సైన్యంలో చేరాలని మూడుసార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అయితే అదే ఆలోచనతో తన కొడుకును ఉన్నత స్థాయికి తేవాలనే ఉద్దేశంతో దేశానికి అవసరమయ్యే వ్యక్తి... శక్తిగా మార్చాలని తన రెండవ కుమారుడు పేరు లింగంపల్లి ఇండియన్ గా పెట్టాడు. కాగా రామగుండం ఎన్టీపీసీ కేంద్రీయ విద్యాలయంలో రాజేష్ పెద్ద కొడుకు హర్ష తేజ మూడో తరగతి, చిన్న కుమారుడు ఇండియన్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు.
బెస్ట్ టాలెంట్ అవార్డుకు చిన్నారి ఎంపిక..
దేశంలో ఎక్కడా లేనివిధంగా తన కుమారుడి పేరు ఇండియన్ అని పెట్టడం వల్ల ఈ బుడ్డోడికి అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 22న హైదరాబాద్ సారథి స్టూడియోలో జరిగే మా అసోసియేషన్ రుద్ర స్టూడియో సెకండ్ ఈవెంట్ ఆధ్వర్యంలో 'బెస్ట్ నేషనలిస్ట్ చైల్డ్' లో ఇండియన్ పేరు నమోదు అయింది. ఇలా దేశం పేరు పెట్టుకోవడం పట్ల పలువురు లింగంపల్లి రాజేష్ ను అభినందిస్తున్నారు. అలాగే గోదావరిఖని చిన్నోడు బెస్ట్ టాలెంట్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.