CM KCR Public Meeting at Jagtial : నేతల ముందస్తు అరెస్టులు

జగిత్యాలో సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన కారణంగా పోలీసులు ప్రతిపక్ష పార్టీల నేతలను ముందస్టుగా అరెస్ట్ చేశారు

Update: 2022-12-07 05:11 GMT

దిశ, కాల్వ శ్రీరాంపూర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నాయకులను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టైన వారిలో మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, మండల ముదిరాజ్ సంఘం కోశాధికారి రానవేన క్రాంతి, ఎస్.ఎఫ్.ఐ.పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు రామగల్ల సురేష్, బీజేపీ మండల అధ్యక్షుడు చల్ల చంద్రమౌళి, బీజేపీ మైనార్టీ మోర్చా నాయకుడు ఎండి రఫీ, బీజేవైఎం జిల్లా కార్యదర్శి చిలువేరి సంపత్ కుమార్ రాగుల రాజకుమార్, బీజేవైఎం జాయింట్ సెక్రెటరీ సత్యనారాయణ ఉన్నారు. కాగా ప్రతిపక్షాల నాయకులు మాట్లాడుతూ పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో కనీసం నిరసన కూడా వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదా అంటూ ప్రశ్నించారు.

Read more:

జగిత్యాల బస్టాండ్ లో ప్రయాణికుల పడిగాపులు

సీఎం సభ కోసం పోలీసుల కష్టాలు..! 

Tags:    

Similar News