తెలంగాణ శాంతిభద్రతల విషయంలో పోలీసుల కృషి ఎనలేనిది : మంత్రి కేటీఆర్

తెలంగాణ శాంతిభద్రతల విషయంలో పోలీసుల కృషి ఎనలేనిదని మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2023-05-02 14:43 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: తెలంగాణ శాంతిభద్రతల విషయంలో పోలీసుల కృషి ఎనలేనిదని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో తొట్టతొలి నాలుగు రోజుల  పోలీసు వార్షిక క్రీడా సంబురాలు మంగళవారం అట్టహాసంగా ముగిశాయి. పోలీసుల వార్షిక క్రీడా సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పోలీస్ వృత్తి అంటేనే ఒత్తిడి తో కూడిన ఉద్యోగమని , వారికి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల శారీరక, మానసిక దృఢత్వమే కాకుండా ఒత్తిడిని అధికమించవచ్చన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడంతో.. వారిలో నూతన ఉత్సాహం వస్తోందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ శాంతిభద్రతల విషయంలో పోలీసుల కృషి ఎనలేనిదన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా రాజన్న సిరిసిల్ల ప్రజల సంక్షేమం కోసం అభయ అప్లికేషన్ ను రూపొందించడం ప్రశంసనీయమన్నారు.

నేరాల నియంత్రణకు సేఫ్ అటో అప్లికేషన్ ఉపయోగడుతుందని అన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి ట్రోఫీలు అందజేశారు.

విజేతలు వీరే!

1.ఓవరాల్ ఛాంపియన్ DAR రేంజర్స్

2.బెస్ట్ అథ్లెట్ మెన్ గోపాల్ DAR రేంజర్స్

3.బెస్ట్ అథ్లెట్ ఉమెన్  పద్మ సిరిసిల్ల స్టైకర్స్

4.బెస్ట్ అథ్లెట్ ఆఫీసర్స్ ఆర్.ఐ కుమారస్వామి

5.టగ్ ఆఫ్ ఫర్ DAR హంటర్స్ టీం

6.వాలీబాల్

1. DAR రేంజర్స్ టీం

2.వేములవాడ రుద్రస్

7. క్రికెట్

1ST ప్లేస్  సిరిసిల్ల సిరిసిల్ల స్టైకర్స్ టీం

2nd DAR హంటర్స్ టీం

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News