బీఆర్ఎస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఎంపీడీవో పై చర్యలు తీసుకోండి : జూలపల్లి ఎంపీటీసీ

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ బీఆర్ఎస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జూలపల్లి ఎంపీడీఓ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూలపల్లి ఎంపీటీసీ అమరగాని మమత ప్రదీప్ కుమార్ జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓలకు బుధవారం ఫిర్యాదు చేశారు.

Update: 2023-04-27 15:49 GMT

దిశ, పెద్దపల్లి టౌన్ : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ బీఆర్ఎస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జూలపల్లి ఎంపీడీఓ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూలపల్లి ఎంపీటీసీ అమరగాని మమత ప్రదీప్ కుమార్ జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓలకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి తన విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రజాప్రతినిధుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని ఆయన తీరుపై విచారణ జరిపి శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఎంపీడీఓ ఇక్కడ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వట్లేదని అమర్యాదగా ప్రవర్తిస్తు కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.

తన తీరు మార్చుకోవాలని ఎంపీపీ ద్వారా ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేదన్నారు. ఎంపీడీఓకు ప్రభుత్వం ద్వారా వాహనం ను కేటాయించి ప్రభుత్వం అద్దె చెల్లిస్తుండగా టాక్సీ ప్లేట్ వాహనాన్ని పెట్టుకోవాల్సిన ఎంపీడీఓ తన అధికారాన్ని ఉపయోగించి తనసమీప బంధువు పేరు మీద ఉన్న స్వంత వాహనాన్ని పెట్టుకుని ప్రభుత్వం నుండి అద్దె తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్దంగా ఓన్ ప్లేట్ వాహనాన్ని వినియోగిస్తూ అక్రమాలకు పాలడుతున్నారని ఎంపీడీవో పైన శాఖాపరమైన విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడే అధికారులకు కనువిప్పు కలిగేలా కఠిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు.

Tags:    

Similar News