పుదుచ్ఛేరి సైన్స్ ఫేర్ లో మెరిసిన జగిత్యాల స్టూడెంట్స్
పుదుచ్ఛేరి లో జరిగిన సైన్స్ ఫేర్ లో జగిత్యాలలోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ స్టూడెంట్ సీహెచ్. మణిదీప్ బార్డర్ ప్రొడక్షన్ విభాగంలో నేషనల్ లెవెల్ లో సెకండ్ ప్రైజ్, తెలంగాణ స్టేట్ లో మొదటి ప్రైజ్ సాధించాడు.
![పుదుచ్ఛేరి సైన్స్ ఫేర్ లో మెరిసిన జగిత్యాల స్టూడెంట్స్ పుదుచ్ఛేరి సైన్స్ ఫేర్ లో మెరిసిన జగిత్యాల స్టూడెంట్స్](https://www.dishadaily.com/h-upload/2025/01/28/1500x900_415876-student.webp)
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : పుదుచ్ఛేరి లో జరిగిన సైన్స్ ఫేర్ లో జగిత్యాలలోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ స్టూడెంట్ సీహెచ్. మణిదీప్ బార్డర్ ప్రొడక్షన్ విభాగంలో నేషనల్ లెవెల్ లో సెకండ్ ప్రైజ్, తెలంగాణ స్టేట్ లో మొదటి ప్రైజ్ సాధించాడు. పుదుచ్ఛేరిలో జనవరి 21 నుండి 25 వరకు జరిగిన సైన్స్ ఫేర్ లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 196 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలవగా విద్యార్థి మణిదీప్ ను ప్రిన్సిపాల్ సిస్టర్ జ్యోతిష్ మరియా, గైడ్ టీచర్ బెజ్జరపు కవిత, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.