మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి : SP Eggadi Bhaskar

ధర్మపురి, జగిత్యాల రూరల్ సర్కిల్ పరిధిలో గల పోలీస్ స్టేషన్లలో పెండింగ్ లో ఉన్న కేసులపై ఎస్పీ భాస్కర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2023-07-18 14:57 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : ధర్మపురి, జగిత్యాల రూరల్ సర్కిల్ పరిధిలో గల పోలీస్ స్టేషన్లలో పెండింగ్ లో ఉన్న కేసులపై ఎస్పీ భాస్కర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. మిస్సింగ్ కేసులతో పాటు పెండింగ్ లో ఉన్న కేసులపై స్పెషల్ ఫోకస్ పెట్టి త్వరగా క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మిస్సింగ్ కేసులు నమోదైనప్పుడు ఆ వ్యక్తి ఫోటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించి త్వరగా ట్రేస్ చేయాలని సూచించారు.

ఇప్పటి వరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు. గుర్తు తెలియని మృతదేహాలు దొరికినప్పుడు కేసు నమోదు చేయగానే వెంటనే ఫోటోలు సీసీటీఎన్ఎస్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. దీని ద్వారా ఎక్కడైనా మిస్సింగ్ పర్సన్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి మిస్సింగ్ కేసులను ఛేదించవచ్చని తెలిపారు. దోపిడీ, దొంగతనాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.

రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. నేరాల నియంత్రణ చర్యలలో కీలకమైన సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీలు వెంకటస్వామి, శ్రీనివాస్, సీఐలు రమణమూర్తి, ఆరీఫ్ అలీఖాన్, ఎస్సైలు, డీసీఆర్బీ, ఐటీ కోర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News