సిరిసిల్ల అదనపు కలెక్టర్ గౌతమి బదిలీ
సిరిసిల్ల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి బదిలీ అయ్యారు. జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పూజారి గౌతమి హైదరాబాద్ మూసీ రివర్ డెవలప్మెంట్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి బదిలీ అయ్యారు. జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పూజారి గౌతమి హైదరాబాద్ మూసీ రివర్ డెవలప్మెంట్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని గత ఏడాది డిసెంబర్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ఆమె మొదటి సారి బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు ఆరు నెలలకు పైగా జిల్లా అదనపు కలెక్టర్ గా గౌతమి సేవలు అందించారు.