సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. దాదాపు 20 మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా నియమిస్తూ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్కో లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా కూడా సందీప్ కుమార్ పనిచేశారు. కాగా సిరిసిల్ల కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అనురాగ్ జయంతి కరీంనగర్ కలెక్టర్ గా బదిలీపై వెళ్లారు.