అధ్యాపకుడి అసభ్య ప్రవర్తన.. వెలుగులోకి కీచక పర్వం

మండలానికి మార్గదర్శకంగా ఉండి విద్యార్థులకు విద్యాబుద్ధులు

Update: 2024-09-20 15:23 GMT

దిశ,గంభీరావుపేట : మండలానికి మార్గదర్శకంగా ఉండి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులు సమాజం తలదించుకునేలా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న భౌతిక శాస్త్ర, ఇంగ్లీష్ అధ్యాపకులు విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు చరవాణిలో అసభ్యకరమైన సందేశాలు పంపించడం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలపడంతో అధ్యాపకులను తల్లిదండ్రులు నిలదీశారు. అధ్యాపక వృత్తిలో ఉండి ఇలాంటి వాటికి పాల్పడటం ఏమిటి అని గట్టిగా మందలించారు. ఇకముందు ఇలాంటి జరగవని అధ్యాపకులు తల్లిదండ్రులను క్షమాపణ కోరారు. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మాట వాస్తవమే అని తప్పు ఒప్పుకోవడంతో ఇకముందు ఎటువంటి తప్పు జరిగిన తాము పూర్తి బాధ్యత వహిస్తామని తల్లిదండ్రులకు రాతపూర్వకంగా అధ్యాపకులు రాసి ఇచ్చారు.


Similar News