ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.57 లక్షలు మోసం..

ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ క్రైమ్ మోసగాళ్లు గోదావరిఖనికి చెందిన ఒక వ్యక్తి దగ్గర్నుండి సుమారు 57 లక్షలు కాజేశారు.

Update: 2025-03-27 16:41 GMT
ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.57 లక్షలు మోసం..
  • whatsapp icon

దిశ, గోదావరిఖని : ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ క్రైమ్ మోసగాళ్లు గోదావరిఖనికి చెందిన ఒక వ్యక్తి దగ్గర్నుండి సుమారు 57 లక్షలు కాజేశారు. గోదావరిఖనికి చెందిన ఒక వ్యక్తి ఈ మోసగాళ్ళ చేతిలో చిక్కుకొని 57,13,332 రూపాయలు మోసపోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి నవంబర్ 2024 లో ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ యం.వెంకటరమణ డీఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పరిశోధనలో జె.క్రిష్ణమూర్తి ఇన్స్పెక్టర్, సిబ్బంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిది నపవాడి గ్రామం, రహతా మండలం, ఆహుల్యానగర్ ఓల్డ్ అహ్మద్నగర్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రంలో పట్టుకొని విచారించగా అతని పేరు శుభం నవనాథ్ షెల్కే, స్టూడెంట్ అని తెలిసింది. ఇతడు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో టెలిగ్రామ్ లో పరిచయమైన వ్యక్తులను ఇతడి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి పాస్ బుక్, ఎటీఎం అతనికి ఇచ్చి అకౌంట్ ఇచ్చినందుకు గాను నెలకు 5000 రూపాయలు కమిషన్ తీసుకునేవాడని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఇలా వచ్చిన డబ్బులను అతని అవసరాలకు, జల్సాలు చేసేవాడని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించామని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ తెలిపారు.

ప్రజలు ఎవరూ కూడా ఆన్లైన్ గేమ్స్, ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్, లోన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీ, ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ లను నమ్మి మోసపోకూడదన్నారు. సులభంగా డబ్బులు వస్తాయని నమ్మి ఎటువంటి ఆన్లైన్ యాప్స్ లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని సైబర్ మోసాలకు గురవకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు.

Similar News