జాతీయ పురస్కారాలు అందుకున్న రాజన్న సిరిసిల్ల వాసులు

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్, పర్యావరణ ప్రేమికుడు దుంపెన రమేష్‌లుకు జాతీయం పురస్కారం దక్కించుకున్నారు.

Update: 2024-02-04 13:42 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్, పర్యావరణ ప్రేమికుడు దుంపెన రమేష్‌లుకు జాతీయం పురస్కారం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హనుమకొండ టీఎన్జీవో భవన్‌లో యువ చైతన్య వెల్ఫేర్ సొసైటీ విశ్వకర్మ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు 2024 సందర్భంగా జాతీయ అవార్డులను ప్రధానం చేశారు. కార్వింగ్ కళా రంగంలో అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గుమ్మడికాయ, క్యారెట్ల‌తో కలిపి రామమందిరాన్ని తయారు చేసిన సందర్భంగా విశిష్ట స్ఫూర్తి చిత్రకళా రత్న జాతీయ అవార్డును అందజేశారు. మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుతూ మొక్కలను ,పెంపకానికి కృషి చేసినందుకు విరాట్ విశ్వకర్మ సేవా రత్న జాతీయ అవార్డును అందజేశారు. ఈ అవార్డులను స్వచ్ఛంద సేవా సమితి చైర్మన్ బ్రహ్మశ్రీ డాక్టర్ వలబోజు మోహన్ రావు, కోఆర్డినేటర్ బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్ సమక్షంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె నాగరాజు, హన్మకొండ జెడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ చేతుల మీదుగా జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీతలకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు.


Similar News