తెలంగాణలో వచ్చేది ఇక రామ రాజ్యమే : అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

తెలంగాణలో వచ్చేది ఇక రామ రాజ్యమేనని, దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ రాబోతుందని సూర్య, చంద్రులు ఉన్నంత వరకు హిందుత్వం బతికే ఉంటుందని అసోం ముఖ్యమంత్రి హిమాంత్​బిశ్వశర్మ అన్నారు.

Update: 2023-05-14 16:40 GMT
తెలంగాణలో వచ్చేది ఇక రామ రాజ్యమే : అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ
  • whatsapp icon

ఓవైసీ హిందువులను నీవ్వేం ఏమీ చేయలేవు

సూర్యచంద్రులు ఉన్నంత వరకు హిందుత్వం ఉంటుంది..

హిందువులంతా.. జాగృతమయ్యారు

దిశ, కరీంనగర్​ బ్యూరో / కరీంనగర్​: తెలంగాణలో వచ్చేది ఇక రామ రాజ్యమేనని, దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ రాబోతుందని సూర్య, చంద్రులు ఉన్నంత వరకు హిందుత్వం బతికే ఉంటుందని అసోం ముఖ్యమంత్రి హిమాంత్​బిశ్వశర్మ అన్నారు. హనుమాన్​ జయంతి సందర్భంగా కరీంనగర్​ఎంపీ, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రకు అసోం సీఎం ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. అస్సాం నుంచి విమానంలో హైదరాబాద్​కు వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాటర్​లో కరీంనగర్​ చేరుకున్నారు. కరీంనగర్​లో ఎంపీ సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. 

వైశ్య భవన్​ నుంచి ప్రారంభమైన హిందూఏత్త యాత్రలో పాల్గొన్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. త్వరలో దేశంలో యూనిఫాం సివిల్ కోడ్​ రాబోతుందని అన్నారు. భారతదేశం నిజమైన సెక్యూలర్ దేశంగా కోబోతోందని తెలిపారు. పదేళ్ల క్రితం అయోధ్యలో రామందిరం అవుతుందని ఎవరూ అనుకోలేదని, ఈ ఏడాది ఆలయ నిర్మాణం పూర్తి అవుతోందని అన్నారు. ఆర్టికల్ 370 ఎత్తివేస్తారని ఎవరూ అనుకోలేదని, కేవలం నరేంద్ర మోదీ నాయకత్వంలో అది సాధ్యమైందన్నారు. తెలంగాణ ఐదు నెలల తరువాత జరిగే ఎన్నికల్లో బండి సంజయ్​ నేతృత్యంలో తెలంగాణలో రామరాజ్యం రాబోతుందని హిమాంత్​ బిశ్వశర్మ అన్నారు.

అసోంలో పెట్రోల్ ధర తక్కువ...

తెలంగాణ కంటే విస్తరణలో ఆర్ధికంగా తక్కువగా ఉన్న అసోం రాష్ర్టంలో లీటర్​పెట్రోల్ ధర రూ. 98రూపాయలు కాగా తెలంగాణలో మాత్రం రూ. 1‌‌08 నుంచి రూ.110 వరకు విక్రయిస్తున్నారని హిమంత్​బిశ్వ శర్మ అన్నారు. అసోంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం 1న వస్తుందని తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదని సీఎం హిమాంత్​ బిశ్వ శర్మ ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ డిల్లీలో ప్రభుత్వ పెద్దలు మద్యం వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనన్నారు. బీఆర్ఎస్ త్వరలోనే వీఆర్ఎస్​ తీసుకుంటుందని అన్నారు.

విశ్వగురు స్థానంలో భారత్...

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్యంలో భారతదేశం విశ్వగురు స్థానంలో నిలుస్తుందని సీఎం హిమాంత్​ బిశ్వ శర్మ అన్నారు. మోదీ నాయకత్వంలో ఆర్ధిక వ్యవస్థ బలంగా తయారైందని, ఈ రోజు పాకిస్టాన్ ఆర్ధిక పరిస్థితి ఏలా ఉందో చూడాలన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం నెంబర్ వన్ కాబోతోందని అన్నారు. హిందువులు అందరూ ఒక్కసారి ఇటీవల వచ్చిన 'ది కేరళ స్టోరీ' చూడాలన్నారు.

హిందూ యువతులను ఉగ్రవాదులుగా ఎలా తయారు చేస్తారో చూపించారని తెలిపారు. లవ్ జిహాద్ అరికట్టేందుకు నేను ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 6 వేల మదర్సాలనూ మూసి చేయించానని, ఎంఐఎం నేత ఓవైసీ నన్ను చూస్తూ.. బెదిరించారని అన్నారు. వచ్చే ఏడాది మరో వెయ్యి మదర్సాలనూ మూసివేస్తానన్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను.. ఓవైసీ ఇంట్లోకి కూడా వెళ్తా.. ఏం చూస్తాడో చూస్తానన్నాడు.

తెలంగాణలో నయా రజాకర్​రాజ్యం పోయి రామ రాజ్యం రావాలన్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఆయన ఆకాంక్షంచారు. ఇక్కడి నుంచి వెళ్లిన తరువాత తెలంగాణలో మార్పు వస్తుందని రామరాజ్యం వస్తుంది అని అసోంలో చెప్తానని సీఎం హిమాంత్​బిశ్వ శర్మ అన్నారు.

Tags:    

Similar News