కథలాపూర్ ఏఎంసీ చైర్మన్ గా పూండ్ర నారాయణరెడ్డి
జగిత్యాల జిల్లా కథలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం ఎట్టకేలకు ఖరారైంది.
దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం ఎట్టకేలకు ఖరారైంది. శుక్రవారం ప్రభుత్వం నూతన పాలకమండలితో కూడిన నియామక పత్రాన్ని వెలువరించింది. కథలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పూండ్ర నారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ గా పులి శిరీష, డైరెక్టర్లుగా మండళోజి నరేష్, అల్లకొండ విజయ్, కాసారపు గంగాధర్, ఆకుల శంకర్, లకావత్ రమేష్,ఎండీ. ఆఫీజుద్దీన్, జవ్వాజి చౌదరి, చీటీ జగన్ రావు, పిడుగు జలపతి రెడ్డి, వాకిటి రాజారెడ్డి లను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న పాలకవర్గానికి మోక్షం లభించినట్లయింది. ఈ నియామకానికి సహకరించిన ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ కు పాలకమండలి సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.