Police Commissioner : పోలీస్ స్టేషన్ వచ్చే వారిపై సత్ప్రవర్తనతో మెలగాలి : రామగుండం సీపీ

మండలం లోని పోలీస్ స్టేషన్ ను సందర్శించిన రామగుండం

Update: 2024-07-18 11:22 GMT

దిశ,కాల్వ శ్రీరాంపూర్ : మండలం లోని పోలీస్ స్టేషన్ ను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్,ఐపీఎస్ ఐజీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు,రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయని అలాగే మండల పరిధి బౌగోలిక పరిస్థితులు, ముఖ్యమైన ప్రదేశాలు, ఈ ప్రాంతం లోని మావోయిస్టుల, వారి కుటుంబ వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే, వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు.

బాధితులకు పోలీస్ అండగా ఉంటూ సత్వర న్యాయం చేస్తారనే నమ్మకం భరోసా కలిగించే విధంగా ప్రవర్తించాలన్నారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. లా అండ్ ఆర్డర్ సమస్యల పై, పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, బీట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్,పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి , కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్ లు ఉన్నారు.

Tags:    

Similar News