తప్పులతడకగా నేమ్ బోర్డులు..
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పలుగ్రామాల నేమ్ బోర్డులు తప్పులతడకగా ఉన్నాయి.
![తప్పులతడకగా నేమ్ బోర్డులు.. తప్పులతడకగా నేమ్ బోర్డులు..](https://www.dishadaily.com/h-upload/2025/01/28/1500x900_415688-web-image.webp)
దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పలుగ్రామాల నేమ్ బోర్డులు తప్పులతడకగా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పపెల్లి గ్రామానికి బదులుగా ఎప్పపల్లి అని, దుంపేట గ్రామానికి బదులుగా దూమ్ పెట్ అని, కలికోటకు బదులుగా కాలికోట అని, కథలాపూర్ కు బదులుగా కతలాపూర్ అని నేమ్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ఆ గ్రామాలకు కొత్తగా వచ్చే ప్రయాణికులు, వ్యాపారం కోసం వచ్చే వారు అయోమయానికి గురవుతున్నారు.
అలాగే కలికోట నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గుండా వెళ్లే ప్రధాన రోడ్డులో అక్కడక్కడా తీవ్రమైన మూల మలుపులు ఉన్నాయి. దీంతో తరచుగా ఆక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి రోడ్డు భవనాల శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.