నిరుపయోగంగా పంచాయతీ సముదాయ భవనం..

రామడుగు గ్రామపంచాయతీ సముదాయ భవనం ఆదిలోనే హంసపాదు అన్న

Update: 2024-11-21 09:10 GMT

దిశ, రామడుగు : రామడుగు గ్రామపంచాయతీ సముదాయ భవనం ఆదిలోనే హంసపాదు అన్న చందంగా తయారయింది. ఈ సందర్భంగా రామడుగు మండల కేంద్రంలోని పురాతన గ్రామ పంచాయతీని తొలగించి నూతన సముదాయ భవన నిర్మాణం కోసం డీఎంఎఫ్టీ గ్రామ పంచాయతీ నిధుల కింద రూ.18 లక్షలు వెచ్చించి పనులు చేపట్టడం జరిగింది. కాగా ఈ భవన సముదాయ నిర్మాణాన్ని ప్రారంభించి దాదాపు ఏడాదికి వస్తున్న ఇప్పటివరకు ఇది నిరుపయోగంగానే ఉండటం గమనార్హం. మండల స్థాయి అధికారులు దృష్టి సారించి ఈ భవన సముదాయ గదులను గ్రామంలోని వ్యాపారస్తులకు అద్దెకు ఇస్తే గ్రామపంచాయతీకి ఆదాయం చేకూరుస్తుందని ప్రజలు కోరుతున్నారు.


Similar News