ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి...

రాష్ట్ర ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2023-02-11 14:54 GMT

దిశ, హుజూరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన కేసీఆర్, శనివారం ప్రభుత్వ విప్ గా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి తనదైన శైలిలో ప్రత్యర్థి అయినా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కౌశిక్ రెడ్డి దూకుడు పెంచారు. నియోజకవర్గ పార్టీ ఇంచార్జిగా గెల్లు శ్రీనివాస్ వ్యవహరిస్తున్నప్పటికీ జనవరి 31న జరిగిన జమ్మికుంట బహిరంగసభలో ప్రజలతో మమేకమైతే వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగుర వేయడం ఖాయమని కేటీఆర్ కౌశిక్ రెడ్డికి సూచించారు. తనపై నమ్మకంతో ప్రభుత్వ విప్ గా నియమించిన సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ లకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. 

Tags:    

Similar News