రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల కీలక పాత్ర.. సంచలనంగా మారిన MLC Jeevan Reddy కామెంట్స్

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Update: 2022-12-11 10:20 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అడ్లూరి లక్ష్మణ్ ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలలో జగిత్యాలకు ప్రత్యేక స్థానం ఉందని.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం లో జగిత్యాల కీలకపాత్ర పోషించనుందని అన్నారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరాలంటే కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పెరిగిన సామాన్యులపై భారం పడకుండా చూస్తామని, రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్న ఉద్యోగాలు తెలంగాణ వాసులకు దక్కడం లేదని మూతపడిన చక్కర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గిరి నాగ భూషణం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటి పర్తి విజయలక్ష్మి, దేవేందర్ రెడ్డి, కండ్లపల్లి దుర్గయ్య, సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ధరా రమేష్ బాబు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్, పట్టణ అధ్యక్షుడు నేహాల్, రమేష్ రావు, మైనార్టీ నాయకులు, మహిపాల్, లైసెట్టి విజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More....

కవితపై ఐదు గంటలుగా ప్రశ్నలవర్షం.. సాయంత్రం 6 గంటలకు సీబీఐ కీలక నిర్ణయం 

Tags:    

Similar News