నియోజకవర్గ ప్రజలే నా బలం.. కార్యకర్తలే నా బలగం : ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

చొప్పదండి మండల బీఆర్ఎస్ నాయకులు కొత్త గంగారెడ్డి, బందారపు అజయ్, ఏఎంసీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, రాజశేఖర్ గార్ల ఆధ్వర్యంలో స్థానిక మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ దగ్గర చొప్పదండి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ఘనస్వాగతం పలికారు.

Update: 2023-08-26 10:06 GMT

దిశ, చొప్పదండి : చొప్పదండి మండల బీఆర్ఎస్ నాయకులు కొత్త గంగారెడ్డి, బందారపు అజయ్, ఏఎంసీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, రాజశేఖర్ గార్ల ఆధ్వర్యంలో స్థానిక మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ దగ్గర చొప్పదండి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీర్యాలీతో బయల్దేరి అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ మేరకు రవిశంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చొప్పదండి నియోజికవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి ప్రకటించినందుకు కేటీఆర్ కి, వినోద్ కుమార్ కి, సంతోష్ కుమార్ కి, శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. 2018లో నియోజకవర్గ ప్రజలందరు ఆశీర్వదించి తనను ఎంఎల్యేగా ఎన్నుకున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని తెలిపారు.

చొప్పదండి నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలకు నాయకులకు, ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తను, గుండెల్లో పెట్టి చూసుకుంటా, కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలే నా బలగం, మీరే నా కుటుంబం, మీరు ప్రతిసారి పార్టీకి, నాకు అండగా ఉన్నారన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి కృతజ్ఞతలు, మీరు లేకపోతే పార్టీ లేదు తాను లేను, పోయిన ఎలక్షన్ కంటే ఈసారి ఇంకా భారీ మెజార్టీతో చొప్పదండి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరబోతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్ మండల అధ్యక్షులు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, సహకార సంఘం అద్యక్షుడు వెల్మ మల్లారెడ్డి నాయకులు ఇప్పనపెళ్ళి సాంబయ్య, అరెళ్ళి చంద్రశేఖర్, లక్ష్మణ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు మార్కెట్ డైరెక్టర్లు, పురపాలక సంఘం కౌన్సిలర్లు వివిధ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News