హుజురాబాద్‌లో వేడి పుట్టిస్తున్న లేఖలు.. సోషల్ మీడియా‌లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

హుజురాబాద్ నియోజక‌వర్గం‌లో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ లేఖలు వేడి పుట్టిస్తున్నాయి.

Update: 2024-11-23 07:22 GMT

దిశ, హుజురాబాద్: హుజురాబాద్ నియోజక‌వర్గం‌లో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ లేఖలు వేడి పుట్టిస్తున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు తీవ్ర స్థాయి‌లో ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్‌రెడ్డి ఇస్తున్న సన్న వడ్ల బోనస్‌ను జోరుగా ప్రచారం చేస్తున్నారు. బ్యాంక్ ఖాతా నంబర్‌తో సహా బోనస్ పడినట్లుగా.. రైతులు తెగ సంతోషం‌లో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. రైతు భరోసా రాకపోయినా.. అంతకన్నా ఎక్కువ డబ్బు బోనస్ ద్వారా వచ్చాయని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పోస్టింగ్స్ పెడుతున్నారు. అందుకు కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన దళిత‌బంధు పథకం‌పై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నేరుగా సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం నియోజక‌వర్గం‌లో చర్చనీయాంశంగా మారింది.

దళిత‌బంధు రెండో విడత నిధులు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో, అరెస్ట్, ఆసుపత్రిలో చేరిక నియోజకవర్గంతో హాట్ టాపిక‌గా మారింది. అందుకు ప్రతిగా మంత్రులు, ఎమ్మెల్యే‌లు కౌంటర్ ఇచ్చిన విషయం విదితమే. రెండో విదుత నిధులు ఖచ్ఛితంగా విడుదల చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్న తరుణం‌లో తాజాగా దళితబంధు ఆగిపోయిందని, నిధులు విడుదల చేయొద్దని జారీ చేసినట్లు ఇచ్చిన ఆర్డర్ కాపీని కౌశిక్‌రెడ్డి మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ పరిణామాలతో నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది. 


Similar News