సిరిసిల్ల వనరులను కేటీఆర్ దోచుకున్నాడు : కేకే మహేందర్ రెడ్డి

సిరిసిల్ల వనరులను కేటీఆర్ దోచుకోవడం తప్ప, 15 ఏళ్లలో

Update: 2024-02-18 13:12 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల వనరులను కేటీఆర్ దోచుకోవడం తప్ప, 15 ఏళ్లలో జిల్లా ఇరిగేషన్ కు చేసింది ఏమి లేదు అని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కె.కె మహేందర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశంలో సిరిసిల్ల ప్రాంత ఇరిగేషన్ పై కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను ఆదివారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖండించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా,మంత్రిగా, షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేటిఆర్ నియోజకవర్గ ఇరిగేషన్ విభాగంలో చేసిందంతా స్వలాభం కోసమేనన్నారు.

గోదావరి జలాలతో జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ప్రగల్భాలు పలికి, లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా 9,10,11, 12 రిజర్వాయర్ లు నిర్మించి, వాటి నుండి సిద్దిపేట ప్రాంతాలకు నీళ్ళు మల్లించుకుపోయారే తప్ప , రంగనాయక సాగర్ నుండి ముస్తాబాద్ ,తంగళ్ళపల్లి మండలాలకు ,మల్లన్న సాగర్ నుండి గంభీరావుపేట మండల ప్రాంతాలకు సాగునీరు అందించలేదని విమర్శించారు. ప్రాజెక్ట్ ల పేరు చెప్పి ప్రజలను నమ్మించి కేటిఆర్ తమ పాములకు నీళ్లను తీసుకుపోయారని వండిపడ్డారు. నేటివరకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ కు అనుసంధానమైన కాల్వలకు భూమి సేకరణ జరగలేదని, కాల్వలు నిర్మించలేదని దుయ్యబట్టారు.

ఇప్పటికైనా కేటిఆర్ గప్పాలు కొట్టడం మానుకోవాలని ,ఆయన వెంట ఉండే అనుచరులు, చెంచాలు ఊక దంపుడు ఉపన్యాసాలు మానుకోవాలని హితవుపలికారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరాజు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ సామర్ల పావని, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, వైద్య శివప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News