మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం

మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

Update: 2024-11-30 10:58 GMT

దిశ, తంగళ్లపల్లి : మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. తంగళ్లపల్లి మండలం పద్మనగర్ హెచ్ పీ పెట్రోల్ పంపు నుంచి మండేపల్లి మల్లుపల్లె వరకు బీటీ రోడ్డుకు రూ.2 కోట్ల 25 లక్షలు మంజూరు కాగా నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం విప్ మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఇటీవల సీఆర్ఆర్ నిధులు రూ.18 కోట్లతో జిల్లాలోని పలు చోట్ల రోడ్లకు మంజూరు చేసి, పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు.

వృద్దులకు ఆత్మీయ పలకరింపు

తంగళ్లపల్లి మండల కేంద్రం పరిధిలోని వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. తంగళ్లపల్లిలోని లగిశెట్టి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలోని వృద్ధాశ్రమంను వారు సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధులను ఆత్మీయంగా పలుకరించి, యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సంతోషిమాత ఆలయంలో పూజలు చేశారు.

    ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, ఉపాధ్యక్షుడు గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, లింగాల భూపతి, కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, వైద్య శివప్రసాద్, గడ్డం నర్సయ్య, పూర్మాని లింగారెడ్డి, చొప్పదండి ప్రకాష్, బైరినేని రాము, పెద్దూరి తిరుపతి, జూపల్లి రాజేశ్వరరావు, మాందాటి తిరుపతి యాదవ్, సత్తు శ్రీనివాసరెడ్డి, జలంధర్ రెడ్డి, కొత్త రవి గౌడ్, మిర్యాల శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. 


Similar News