మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ వలస లీడర్లపై మండిపాటు

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2025-04-07 15:57 GMT
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ వలస లీడర్లపై మండిపాటు
  • whatsapp icon

దిశ,జగిత్యాల ప్రతినిధి: మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన నాయకులను ఉద్దేశిస్తూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సోమవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు సామాన్య ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు.

ఇప్పుడు అదే నాయకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి రాజ్యాధికారం చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి జగిత్యాల నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీవన్ రెడ్డి మొదటి నుండి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సందర్భం వచ్చిన ప్రతిసారీ పరీక్షగా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Similar News