అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పలువురు ముఖ్య నేతలు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

Update: 2023-04-25 14:22 GMT

కలెక్టర్ కాళ్లు మొక్కిన కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి

దిశ, కరీంనగర్ టౌన్: గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పలువురు ముఖ్య నేతలు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులడు కవ్వంపల్లి సత్యనారాయణ, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వడగళ్ల వానలతో నష్టపోయిన రైతాంగాన్ని పలకరిస్తే కన్నీటి పర్యంతం అవుతున్న ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు.

ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పార్టీ ప్లీనరీ సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. గత నెలలో చొప్పదండి నియోజకవర్గం పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ వడగళ్లతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ విస్మరించారని ఎద్దేవా చేవారు. రెండు రోజుల కింద జిల్లా మంత్రి గంగుల కమలాకర్ నష్టపోయిన కౌలు రైతులకు సైతం చెక్కులు అందిస్తామని ప్రకటించి 48 గంటలు దాటినా ఇప్పటి వరకు అతిగతి లేదన్నారు. 20 రోజులుగా రైతులు రోడ్లపై కుప్పలుగా ఆరబోసిన ధాన్యం స్పష్టంగా కనబడుతున్నా.. కొబ్బరికాయలు కొట్టడానికి పరిమితమైన ఐకేపీ సెంటర్లు సకాలంలో ప్రారంభించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం రైతుల ఆదుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యమాన్ని చేపడతామన్నారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, రహమత్ హుస్సేన్, ఎండీ తాజ్, మేనేనీ రోహిత్ రావు, రవీందర్ రెడ్డి, రాజమల్లయ్య, మల్యాల సుజిత్ కుమార్, రాజిరెడ్డి, పొన్నం శ్రీనివాస్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, రామ్ రెడ్డి, ఎర్ర శ్రీనివాస్, హరీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News