దిశ కథనాన్ని అధికారుల చెంతకు చేర్చిన సామాజిక నేత
మానవ మనుగడకే ముప్పు అని పర్యావరణంపై దిశ పత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనం పాఠకులను ఆకట్టుకుంది.
![దిశ కథనాన్ని అధికారుల చెంతకు చేర్చిన సామాజిక నేత దిశ కథనాన్ని అధికారుల చెంతకు చేర్చిన సామాజిక నేత](https://www.dishadaily.com/h-upload/2025/01/28/1500x900_415739-effect.webp)
దిశ, గోదావరిఖని : మానవ మనుగడకే ముప్పు అని పర్యావరణంపై దిశ పత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనం పాఠకులను ఆకట్టుకుంది. పెద్దపెల్లి జిల్లా తో పాటు మెయిన్ పేజీలలో ప్రచురితమైనది. రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మరో రెండు వేల 400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తుంది. ఈ ప్రాంతంలో మనుషులు నివసించేందుకు వీలు లేనంత కాలుష్యం ఉందని కథనంలో తెలిపింది.
దాంతో దిశ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, రాష్ట్ర పొల్యూషన్ బోర్డ్, నేషనల్ పొల్యూషన్ బోర్డ్, పీఎంఓ ఇండియా, తెలంగాణ సీఎంఓ, పీఐబీ ఇండియా, సీఎండీ ఎన్టిపీసీ తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా వివరించారు. సమస్యను పరిష్కరించాలని దిశ పత్రిక కథనాన్ని ట్యాగ్ చేశారు. దిశ పత్రికలో ప్రచురితమవుతున్న కథనాలు సమస్యలు పరిష్కరించే దిశలో ఉంటున్నాయని, అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్నారని కొనియాడారు.