దిశ ఎఫెక్ట్....తీరిన నీటి సమస్య
ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నివాసముంటున్న12 వేల మందికి పైగా ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని దిశలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
దిశ,ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నివాసముంటున్న12 వేల మందికి పైగా ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని దిశలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మూసుకుపోయిన గేట్ వాల్వ్‌ను శనివారం తెరిపించారు. ఎల్లారెడ్డి పేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామాల మధ్య గల కిష్టం పల్లె జగదంబ వైన్స్ వద్ద ఓ ప్లాట్ యజమాని తన ప్లాట్ ను శుభ్రం చేసుకుంటుండగా ఆ మట్టి గేట్ వాల్వ్ పై పడగా అది మూసుకుపోయింది.
దాంతో శనివారం గేట్ వాల్వ్ మూసిన గుర్తు తెలియని వ్యక్తులు అనే శీర్షికన దిశ లో ప్రచురితమైన వార్త కు అధికార యంత్రాంగం కదిలింది. మట్టి పడి మూసుకుపోయిన గేట్ వాల్వ్ ను జేసీబీ సహాయంతో మిషన్ భగీరథ డీఈ అనిల్, ఏఈ ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మిషన్ భగీరథ సూపర్ వైజర్ అంజయ్య, ఆపరేటర్ కిషన్, గ్రామపంచాయతీ పంప్ ఆపరేటర్ లు గుండం యాదగిరి, పిట్ల రాజు, రొడ్డ సతీష్ పాల్గొని నీటి సమస్య తీర్చారు. ఈ సందర్భంగా దిశకు ఎల్లారెడ్డి పేట గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.