కరీంనగర్ కార్పొరేషన్‌లో కాంప్రమైజ్!

కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్,

Update: 2025-04-07 16:02 GMT

దిశ, కరీంనగర్ టౌన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్, మెండి చంద్రశేఖర్ ను దూషించిన కేసులో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజపేయి సోమవారం కమిషన్ ఎదుట హాజరయ్యారు. గతంలో చంద్రశేఖర్ ను గెట్ అవుట్ అంటూ కమిషనర్ చాహత్ బాజపేయి దురుసుగా ప్రవర్తించగా... చంద్రశేఖర్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించారు.

కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఇద్దరు కమిషన్ ముందు హాజరయ్యారు. విచారణ చేపట్టి వారి వాదనలు విన్న కమిషన్ సయోధ్య కుదురుచ్చారు. దీంతో వివాదం సర్దుమనిగినట్లయింది. కాగా, ప్రజాసేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు, శాంతి, సామరస్యంగా సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు సహనం కోల్పోయి ప్రవర్తించడం పలు వివాదాలకు కారణమవుతోంది. బాధ్యతాయుతమైన అధికారి, నేతలు ఇలా కమిషన్ ఎదుట హాజరై రాజీ కుదుర్చుకునే పరిస్థితి దాకా వెళ్లడం వారి పనితీరుకు అద్దం పడుతుంది.

Similar News