కలెక్టరేట్‌కు భోగ శ్రావణి.. రాజీనామాపై క్లారిటీ తీసుకున్న కలెక్టర్ రవి

మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన భోగ శ్రావణి సోమవారం కలెక్టరేట్ కార్యాలయలో జిల్లా కలెక్టర్ రవిని కలిసి తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు.

Update: 2023-01-30 11:17 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన భోగ శ్రావణి సోమవారం కలెక్టరేట్ కార్యాలయలో జిల్లా కలెక్టర్ రవిని కలిసి తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. రాజీనామా అంశంపై నిర్ణయం తీసుకునే క్రమంలోనే శ్రావణిని కలెక్టరేట్‌కు పిలిపించినట్లు సమాచారం. ఎవరి ఒత్తిడి వల్ల తాను రాజీనామా చేయలేదని.. ఎమ్మెల్యే వేధింపులు భరించలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రావణి వెల్లడించారు. అయితే తాను కేవలం పదవికి మాత్రమే రాజీనామా చేశానని పార్టీలోనే కొనసాగుతనని శ్రావణి స్పష్టం చేసారు. శ్రావణి రాజీనామా విషయంలో కలెక్టర్ రవి మరోసారి స్పష్టత తీసుకున్న నేపథ్యంలో చైర్మన్ పీఠం రేసులో ఉన్న కౌన్సిలర్లు వారి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే శ్రావణి రాజీనామా ఆమోదిస్తారా లేక ప్రస్తుతానికి పెండింగ్‌లో పెడతారా అనేది చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: 

బ్రేకింగ్: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామాకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్

Tags:    

Similar News