భట్టి ముందే కాంగ్రెస్​ నేతల బాహాబాహీ (వీడియో)

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు బాహాబాహీకిదిగారు.

Update: 2023-04-18 12:31 GMT
భట్టి ముందే కాంగ్రెస్​ నేతల బాహాబాహీ (వీడియో)
  • whatsapp icon

 దిశ, కరీంనగర్​ బ్యూరో: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు బాహాబాహీకిదిగారు. భట్టి చేపట్టిన పాదయాత్ర మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గానికి చేరింది. నియోజకవర్గంలోని ప్రారంభ గ్రామమైన పాలితం గ్రామంలో భట్టికి స్వాగతం తెలపడానికి ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణ రావు, ఓదెల జెడ్పీటీసీ గంట రాములు రెండు వర్గాలు భట్టికి స్వాగతం పలకడానికి పోటీ పడ్డారు. ఈ క్రమంలో గంట రాములు వర్గం యువకులు రాములుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రతిగా విజయ రమణ రావు వర్గీయులు సైతం నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. భట్టి ముందే రెండు వర్గాల నేతలు బాహాబాహీకి దిగడం చర్చనీయ అంశంగా మారింది.

Full View
Tags:    

Similar News